17 జులై, 2012

సంబంధం లేదు: బాలకృష్ణపై పురంధేశ్వరి, గెంటేశారు




















విశాఖపట్నం: తన సోదరుడు, హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశంపై కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఆదివారం స్పందించారు. ఆమె విశాఖపట్నంలో ముంబయి - విశాఖ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను విలేకరులు బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రంపై ఆమెను ప్రశ్నించారు. బాలకృష్ణ ప్రవేశం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిందని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావును పార్టీ నుండి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అని... ఆయన పార్టీ చిహ్నం సింహం అని చెప్పారు. తనను టిడిపి నుండి గెంటి వేసినప్పుడే ఆయన ఎన్నికల కమిషన్ నుండి సింహం గుర్తును తెచ్చుకున్నారని చెప్పారు. విశాఖకు మరిన్ని ట్రైన్‌లు తీసుకు వస్తానని చెప్పారు.

కాగా తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి త్వరలో వస్తున్నట్లు బాలయ్య శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారని బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనేది నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమని ఆయన అన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఆయన చెప్పారు. నందమూరి కుటుంబంలో ఏ విధమైన విభేదాలు లేవని ఆయన అన్నారు.

విభేదాల పేరుతో అభిమానులను చీల్చవద్దని, ఎవరి అభిమానులు వారికి ఉంటారని ఆయన అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను ఎప్పుడు రావాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. స్వార్థంతో పార్టీలు మార్చేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని, నాని వంటివారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.

తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడగలేదని ఆయన చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. నాయకత్వంపై తాను ఏ విధమైన డిమాండ్లు పెట్టలేదని ఆయన చెప్పారు. పార్టీలో నాయకత్వ మార్పు అవసరం లేదని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడేనని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చంద్రబాబుకు చెప్పినట్లు ఆనయ తెలిపారు.

పార్టీ అభిమానులు కోరుకుంటే లోకేష్ రాజకీయాల్లోకి వస్తే తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అభిమానుల పేరుతో పార్టీ ప్రతిష్టను దిగజారిస్తే సహించేది లేదని ఆయన అన్నారు. తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పార్టీకి సేవలు చేయడానికే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పారు. అభిమానులంతా పార్టీకి అండగా ఉంటారని ఆయన చెప్పారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు.

నందమూరి అభిమానులను విడగొట్టాలనుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు. నందమూరి అభిమానులంతా తనతోనే ఉన్నారని ఆయన చెప్పారు. నందమూరి కుటుంబ సభ్యులమంతా

కామెంట్‌లు లేవు: