5 జులై, 2012

పశువుల కొట్టంలో పెట్టి మహిళపై మూడేళ్లు రేప్



















భోపాల్: పశువుల కొట్టంలో పెట్టిన ఓ 20 ఏళ్ల మహిళను మూడేళ్ల పాటు అత్యంత కిరాతకంగా అందిన వారికి అందినంత అన్నట్లు అందరూ రేప్ చేశారు. భర్తతో సహా అతని బంధువులు, గ్రామస్థులు ఆమెపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వరకట్నం తేనందుకు భర్త, అతని కుటుంబ సభ్యులు ఈ పైశాచిక చర్యకు పాల్పడ్డారు. మూడేళ్ల పాటు ఈ చిత్రహింసలను అనుభవించిన ఆ మహిళను ఈ ఏడాది మేలో 50 వేల రూపాయలకు అప్పులిచ్చే వ్యక్తికి అమ్మేశారు.

తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను పొరుగున ఉన్న వ్యక్తి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అయితే అతను కూడా మార్గమధ్యంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మనీలెండర్ వద్ద ఆమెను చూసిన ఓ వ్యక్తి విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేశాడు. జులై 1వ తేదీన ఆ మహిళ రహత్‌గిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన కిరాతక చర్యలను పోలీసులకు వివరించింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం - ఆ యువతి ఐదేళ్ల క్ర్తితం పరశ్రీ త్యోండాకు చెందిన అనంద్ కుర్మి పెళ్లి చేసుకుంది. పెళ్లి కాగానే అత్తగారి కుటుంబ సభ్యులు ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించారు.

పెళ్లి సమయంలో లక్ష రూపాయలు ఇచ్చామని, అయినా మరింత వరకట్నం కోసం డిమాండ్ చేస్తూ వచ్చారని యువతి తండ్రి రామ్ కిషన్ చెప్పాడు. పెళ్లయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. బలవంతంగా అబార్షన్ చేయించారు. ఆమెను పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశారు. రోజుల తరబడి నీళ్లు, తిండి ఉండేవి కావు. పొరుగున ఉన్న గుడ్డు మహరాజ్, అతని మిత్రులు ఆమెను నెలల తరబడి రేప్ చేశారు.

ఆ తర్వాత భర్త ఆమెను ఖురైలోని బంధువుల ఇంటికి మార్చాడు. అక్కడ రామ్ సింగ్, అతని కుమారులు నరేంద్ర, లోకేంద్ర ఆమెను వదిలిపెట్టలేదు. ఆమెను గదిలో పెట్టి తాళం వేసి దాదాపు 20 రోజుల పాటు ఆమెపై అత్యాచారం జరిపారు. రామ్ సింగ్ ఆమెను మహునా గ్రామానికి చెందిన మనీ లెండర్‌కు విక్రయించాడు. ఆమెపై లైంగిక దోపిడీ సాగుతూనే ఉన్నది. అస్వస్థతకు గురైన ఆ యువతిని ఖడక్ సింగ్ అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకుని పోతూ మార్గమధ్యంలో రేప్ చేశాడు. ఆ తర్వాత మనీ లెండర్ ఇంట్లో వదిలేశాడు.

మనీ లెండర్ ఇంట్లో ఆమె బంధువులు ఆమెను చూశాడు. విషయాన్ని ఆమె తండ్రికి చెప్పాడు. తరుచుగా ఆమె అత్తవారింటికి ఆమె తండ్రి వస్తున్నా కట్నం పూర్తిగా ఇచ్చే వరకు కూతురిని కలుసుకోవడానికి వీల్లేదని చెబుతూ వచ్చారు. జూన్ 28వ తేదీన ఆమెను కుటుంబ సభ్యులు కాపాడారు. మధ్‌దేవ్రా గ్రామంలోని తండ్రి ఇంటికి తెచ్చారు. రెండు రోజుల తర్వాత విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

1 కామెంట్‌:

ఆ.సౌమ్య చెప్పారు...

ప్చ్...దారుణం..చ