మెగా స్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాది రాళ్లు'. తాజాగా ఆ
చిత్రాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నారు మెగాస్టార్. ఇటీవల జరిగిన
‘హార్మోన్స్' మూవీ ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ...‘శరీరం
వృద్ధిచెందడానికి హార్మోన్స్ ఎంత అవసరమో సమాజం పురోభివృద్ధి సాధించడానికి
యువత సేవలు అంతే అవసరం. ఈ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కథ
వింటున్నప్పుడు నేను చేసిన ‘పునాది రాళ్లు' చిత్రం గుర్తుకు వచ్చింది. అనేక
రుగ్మతలతో సతమతమవుతున్న ఓ గ్రామాన్ని యువకుల బృందం ఎలా సంస్కరించిందన్న
పాయింట్ ఆకట్టుకుంది' అన్నారు చిరంజీవి.
ఎస్.ఎస్.నాయక్ నిర్మిస్తున్న ఈ
చిత్రానికి డా ఆనంద్ ఇస్లావత్ దర్శకుడు. బంజారా మూవీస్ పతాకంపై ఈచిత్రం
రూపొందుతోంది. కష్టపడి పనిచేస్తే ఎవరైనా మెగాస్టార్స్, సూపర్‌స్టార్స్
కావొచ్చని ఆయన చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.
చిత్ర దర్శకుడు ఆనంద్
ఇస్లావత్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజానికి మేలు చేయాలని చెబుతూ ఈ
చిత్రం వారిని ఉత్తేజితులను చేస్తుందని, అబ్దుల్‌కలామ్ మాటలను స్ఫూర్తిగా
తీసుకుని ఈ కథను రాసుకున్నామని తెలిపారు. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా
రూపొందిన ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్‌గా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత
ఎన్‌ఎస్ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య,
ప్రసన్నకుమార్, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రారెడ్డి,
డిటి నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్, పావనీరెడ్డి, అనూహ్యారెడ్డి,
అమృత, నందినీరాయ్, దీక్ష, రంగనాథ్, ఎల్.బి.శ్రీరామ్, శివన్నారాయణ,
గౌతమ్‌రాజు, సుహాసిని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్
లక్కరాజు, పాటలు: శ్రీజో, కెమెరా: వి.శశిధర్, ఎడిటింగ్: అర్చనా ఆనంద్,
నిర్మాత: ఎన్.ఎస్.నాయక్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఆనంద్
ఇస్లావత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి