పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్
ఇలా అందరు సినిమా హీరోలు, నటీనటుల సంపాదనపై ఇకపై 12.36% సర్వీస్ టాక్స్
విధించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిర్మాతల గుండెల్లో గుబులు మొదలైంది.
అయితే ఇది ఒక్క మన తెలుగు పరిశ్రమలోని హీలోపైన కాదు... దేశంలోని బాలీవుడ్,
టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్‌లోనూ అమలు కానుంది.
ప్రస్తుతం
హీరోల రెమ్యూనరేషన్ విషయానికొస్తే.... బాలీవుడ్ టాప్ హీరోలు సినిమాకు 25
నుంచి 30 కోట్లు వసూలు చేస్తుండగా, టాలీవుడ్ టాప్ హీరోల రేట్లు రూ. కోట్ల 5
నుంచి మొదలు కొని రూ. 12 కోట్ల వరకు ఉంది. సర్వీస్ టాక్స్ వేసిన నేపథ్యంలో
ఆ భారం హీరోలు తమపైనే మోపుతారని నిర్మాతలు భయ పడుతున్నారు.
ఈ
నేపథ్యంలో ఏపీ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, మావీ ఆర్టిస్ట్
అసోసియేషన్ అధ్యక్షుడు మురళి మోహన్ సర్వీస్ టాక్స్ 5%నికి తగ్గించాలని
కోరుతూ ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది
నిర్మాతలు కష్టాల్లో ఉన్నారని, ఈనేపథ్యంలో హీరోల సంపాదనపై సర్వీస్ టాక్స్
భారం పరోక్షంగా తమపైనే పడుతుందని వారు విన్నవించనున్నట్లు తెలుస్తోంది.
కాగా.... ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా బంద్
పాటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి