17 జులై, 2012

రాజమండ్రి నుంచి పోటీ చేస్తా: మురళీమోహన్




















ఖమ్మం: రాబోయే 2014 ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి లోకసభకు తప్పకుండా పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటుడు మురళీమోహన్ అన్నారు. భద్రాచలంలో సోమవారం సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోని పలు సన్నివేశాల్లో నటించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

2009 ఎన్నికల్లో వాస్తవానికి తాను ప్రజల ఓట్లతో గెలిచానని, అయితే రాజకీయంతో ఓడానన్నారు. తన జీవితంలో ఏ రంగంలోను ఇప్పటి వరకు ఓటమి చవిచూడలేదని, అటువంటిది ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో పోగొట్టుకున్న చోటే గెలుపు సాధించాలని భావిస్తున్నానని ఆయన అన్నారు.
2014 ఎన్నికల్లో మూడు పార్టీల వ్యవస్థతో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు లేకపోలేదని, ఇది రా ష్ట్ర అభివృద్ధికే పొంచి ఉన్న ప్రమాదమని అన్నారు. గతంలో ఐటీ కేంద్రంగా అన్ని రా ష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ నేడు బీహార్‌గా మారిందని అన్నారు.

ఉద్యమాల మూలంగా రా ష్ట్రానికి కొత్త కంపెనీలు రావడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా, ప్రజాబలానికి కొదవ లేదన్నారు. పార్టీ ఉచ్చ స్థితిలో, హీన స్థితిలో ఉన్న నాడు పార్టీని అంటుపెట్టుకొని ఉన్న వారే నిజమైన నాయకులు కార్యకర్తలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కులాల ప్రస్తావన రావడం ఎంత మాత్రం వాంచనీయం కాదన్నారు. కుల మత వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు: