6 జులై, 2012

నా రీ ఎంట్రీకి తగిన సినిమా : శ్రీదేవి




















అందాల నటి శ్రీదేవి దాదాపు 15ఏళ్ల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం ‘ఇంగ్లీష్-వింగ్లీష్'. ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి గౌరి షిండే దర్శకుడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం గురించి శ్రీదేవి మాట్లాడుతూ....గౌరీ చెప్పిన కథ నాహృదయాన్ని హత్తుకుంది. చాలా కాలం తర్వాత ఇలాంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుక వస్తే బాగుంటుందనుకుంటున్నాను. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రతి భార్య ఇందులో నా పాత్రతతో తనను తాను పోల్చుకుంటుంది అని, నా రీ ఎంట్రీకి ఇది సరైన సినిమా అని నా ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది.

భర్త పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని ఓ మహిళ అనుకోకుండా ఒంటరిగా న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. బయటి ప్రపంచం తెలియని ఆవిడ అక్కడ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని తంటాలు పడుతుంది. ఆతర్వాత అందరికీ ఎలా ఆదర్శంగా నిలిచింది అనేది కథాంశం. పల్లెటూరి యువతిగా శ్రీదేవి తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె నటనే ప్రధానాకర్షణగా తెరకెక్కిన ఈ చిత్రంలో అందరికి కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో వున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఫ్రెంచ్ నటుడు మెహిదీ నిబ్బో, ఆదిల్ హుస్సేన్, ప్రయా ఆనంద్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా ప్రత్యేక పాత్రలో ఓ తెలుగు హీరో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: లక్ష్మణ్ పుటేకర్, పాటలు: కృష్ణచైతన్య, ఎడిటింగ్: హేమంతి సర్కార్, సౌండ్ ఇంజినీర్: రసూల్ పోకుట్టి, సమర్పణ: ఈరోస్ ఇంటర్నేషనల్, ఆర్.బాల్కీ, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.కె.దమని, సునీల్ లుల్లా, ఆర్.బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరి షిండే.

కామెంట్‌లు లేవు: