16 జులై, 2012

శరీరాన్ని ముక్కలు చేసి, వైజాగ్ స్టేషన్‌లో పడేశారు
























విశాఖపట్నం: వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ఘోరం వెలుగు చూసింది. గతంలో సరూర్‌నగర్ చెరువులో, మహబూబ్‌నగర్‌లో మృతదేహాలు లభ్యమైనట్లుగా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో సోమవారం గన్నీ బ్యాగులలో మృతదేహాలు కనిపించాయి. రైల్వే స్టేషన్‌లోని ఆరవ నెంబర్ ప్లాట్ ఫారం వద్ద మూడు గన్నీ బ్యాగులలో శరీర అవయవాలు ముక్కలు ముక్కలుగా చేసి కుక్కి ఉన్నాయి. ఎక్కడో వీరిని హత్య చేసి ఇక్కడకు తీసుకు వచ్చి పడేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

బ్యాగులలో మృతదేహాలు కనిపించడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గన్నీ బ్యాగులను మార్చురీకి పంపించారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం పంపించామని, ఇప్పుడే ప్రాథమికంగా ఓ అంచనాకు రాలేదమని, పరీక్షల అనంతరం ఏదైనా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమకు సమాచారమందగానే వచ్చామని తెలిపారు.

మరోవైపు అనంతపురం జిల్లా కొడికొండ వద్ద ఓ స్కూల్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శ్రీ సాయినికేతన్ పాఠశాలకు చెందిన ఓ స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకు వెళుతుండగా బెంగళూరు నుండి వస్తున్న ఓ లారీ ఢీకొంది. ప్రమాదానికి లారీ వేగంగా రావడమే కారణమని చెబుతున్నారు. బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం కూడా ప్రమాద తీవ్రతకు కారణమని చెబుతున్నారు.

పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హిందూపురం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు బస్సు, లారీని తగులబెట్టారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలభై మంది గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.

1 కామెంట్‌:

Telangana Muddhubidda చెప్పారు...

ithadu evaro emo emo maatalu raasaru. kannesamu athadi blog lo comments enable chese dhyrayamu kuda ledhu.

IThadu matalu matladuthunnadu.

Peddha peddha matalu use chesaadu. Sunnithamgaa vishyamu cheppachhu.

Ilanti valla valane kadha manamu vellani eppudu thanni tharimeyyala ani chusedhi.

http://teluguyogi.blogspot.in/2012/07/blog-post_16.html

Memu ikkada janthu balile.. mari meeru narabalilu isthunnaru.
http://www.blogger.com/comment.g?blogID=31063414&postID=7855534309685134724