రాజమౌళి ‘ఈగ' చిత్రం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. అయితే ఈ నష్టం ఈగ
చిత్ర నిర్మాతలకు కాదు. ‘ఈగ'తో పాటు రిలీజైన ఇతర సినిమాల నిర్మాతలకు. ఇది
తెలుగు చిత్రమే అయినా...అటు బాలీవుడ్ చిత్రాలపై, తమిళ స్టార్ హీరోల
చిత్రాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీసు పరిధిలో ఈగ
ప్రభావం ఇతర భారతీయ సినిమాలపై ఎక్కువగా ఉంది. ఇప్పటికే ‘ఈగ' ధాటికి
అమెరికాలో విడుదలైన బోల్ బచ్చన్ చిత్రం కలెక్షన్లు తగ్గి పోయాయి. ఈగ చిత్రం
తెలుగు, తమిళంలో మాత్రమే విడుదలైంది. అయినా సరే హిందీ జనాలు ఈ గ్రాఫికల్
వండర్‌ను ఎగబడి చూస్తుడటం గమనార్హం. దీంతో ఇటీవల విడుదలైన సైఫ్ అలీఖాన్
‘కాక్‌టైల్', తమిళ చిత్రం ‘బిల్లా2' చిత్రాల నిర్మాతలకు కొంత నష్టాన్ని
తెచ్చాయనే చెప్పాలి.
అమెరికాలో కలెక్షన్ల డీటేల్స్
అమెరికాలో ఈగ(తెలుగు) 31 స్క్రీన్లలో, తమిళ్ వెర్షన్ నాన్ఈ 8 స్ర్కీన్లలో విడుదలైంది. జూలై 6న విడుదలైన ఈచిత్రానికి మామూలు వీకెండ్‌కు తోడు యూఎస్ ఇండిపెండెన్స్ డే వీకెండ్ కూడా కలిసి రావడంతో దాదాపు రూ. 3.64 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మరో 20 స్క్రీన్లను పెంచారు. అయితే లాస్ట్ వీకెండ్ మాత్రం కలెక్షన్లు ఊహించినంతగా లేవనే చెప్పాలి. మొత్తానికి 9 రోజుల్లో ఈచిత్రం రూ. 4.02 కోట్లు(($ 730,457) వసూళ్లు సాధించింది.
ఇక
బిల్లా2, కాక్‌టైల్ చిత్ర కలెక్షన్ల విషయానికొస్తే....లాస్ట్ వీకెండ్
విడుదలైన ఈ చిత్రాలు తొలి రోజు మంచి కలెక్షన్లే సాధించాయి. బిల్లా 2 తొలి
రోజు రూ. 33.34 లక్షలు($ 60,478), కాక్ టైల్ రూ. 1.21 కోట్లు($ 220,000)
సాధించాయి. ఈగ చిత్రం లేకుంటే వీటి వసూళ్లు మరింత ఎక్కువగా ఉండేవని ట్రేడ్
వర్గాల మాట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి