12 జులై, 2012

జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ స్టోరీపై వివరణ



















శ్రీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘బాద్ షా' చిత్రం రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈచిత్రం స్టోరీ లైన్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘సింగ్ ఈజ్ కింగ్' చిత్రం ఆధారంగా తయారు చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు ‘బాద్ షా' రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్.

‘బాద్ షా' స్టోరీలైన్ ఏ సినిమా ఆధారంగా తయారు చేయలేదని, ఇదివరకెన్నడూ రాని ఫ్రెష్ స్టోరీ... నేను మరియు గోపీ మోహన్ కలిసి ఈచిత్రం కథను తయారు చేశాము అని కోన వెంకట్ తెలిపారు. ‘బాద్ షా' చిత్రంపై వినిపిస్తున్న రూమర్లను నమ్మొద్దని, ఈ చిత్రం స్టోరీలైన్ ఏ బాషా చిత్రం నుంచి కూడా ఇన్‌స్పైర్ అయి తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ జులై 13 నుంచి ఇటలీలో ప్రారంభం కానుంది.

గతంలో ఈచిత్రంలోని ఎన్టీఆర్ పాత్రపై కోన స్పందిస్తూ....‘బాద్ షా చిత్రంలో ఎన్టీఆర్ సీక్రెట్ ఏజెంటుగా కానీ, జేమ్స్ బాండ్ పాత్రలో కానీ నటించడం లేదు. ఇదొక గుడ్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ మసాలాతో పాటు అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయి' అని చెప్పుకొచ్చారు.

బాద్ షా చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం పాటలు ఆగస్టు, సెప్టెంబర్ వరకు వినే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై ఓ రేంజి అంచనాలు ఉంటాయనటంలో సందేహం లేదు.

కామెంట్‌లు లేవు: