హైదరాబాద్: రెండు రోజుల్లో 264 తాగుబోతు డ్రైవర్ల అరెస్ట్
మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. రెండు రాత్రుల్లో మొత్తం 264 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ అయ్యాయి. హైదరాబాద్ నగర పోలీసులు గత నెల 29, 30 తేదీల్లో ఓ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. జంట నగరాల్లో రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 1.00 గంట ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
మొత్తం
264 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను బుక్ చేసి వారిని అరెస్టు చేశారు.
అంతేకాదు వారి వాహనాలను కూడా నిర్భదించారు. ఇందులో 74 వాహనాలు ఫోర్-వీలర్స్
కాగా, 178 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోరిక్షాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరందని 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీ. బిసి రాయుడు ముందు హాజరు
పరచారు. మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పును జరిమానా విధించారు.
తాగి వాహనం నడపకూడని ఎన్ని విధాలుగా చెబుతున్నా కొందరికి అది చెవుల నుంచి
మెదడుకు ఎక్కడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి తమ ప్రాణాలను
రిస్కులో పెట్టడమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా
ప్రవర్తిస్తున్నారు. పై సందర్భాన్ని పరిశీలిస్తే.. తాగి వాహనాలు నడిపే
వారిలో ఎక్కువగా టూవీలర్‌ను ఉపయోగించే వారే ఉన్నారు.
ఆల్కహాల్ సేవించిన
వారికి మెదడు గతి తప్పుతుంది. వారు సేవించిన ఆల్కహాల్ నేరుగా మెదడు
పనితీరుపై ప్రభావితం చూపుతుంది. ఫలితంగా శరీర కదలికల్లో వ్యత్యాసం
వస్తుంది. వాహనంపై ఆల్కహాల్ సేవించ ముందు ఉన్న కంట్రోల్ ఆల్కహాల్ సేవించిన
తర్వాత ఉండదు. ఈ సందర్భంలోనే వాహన చోదకులు మూర్ఖంగా వాహనాలు నడిపి
ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
తెలుసుకోండి.. ఇకనైనా
మేలుకోండి.. మీకోసం మీ ఇంట్లో వాళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారని
మర్చిపోకండి. మద్యం సేవించి వాహనాలను నడపకండి. మీ సన్నిహితులకు తీరని లోటను
మిగల్చకండి. మీ బంగారు భవిష్యత్తును మీ చేతుల్తోనే నాశనం చేసుకోకండి.
ఎల్లప్పుడూ సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరుకోండి. Have A Safe And Enjoyable Drive.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి