మాస్ మహరాజా రవితేజ, హాట్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం ‘సార్ వస్తారా'
చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై పరశురామ్
దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని
రూపొందిస్తున్నారు.ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎయిర్
పోర్టు సెట్ లో జరుగుతోంది. ఇద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలు
చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రంలో మరో హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ
సెంకడ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగిసన
తర్వాత ఊటీలో ప్రకృతి అందాల మధ్య చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు
చేస్తున్నారు. గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో ‘ఆంజనేయులు' అనే మూవీ
వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు
అశ్వినీదత్.
మరో వైపు రవితేజ ‘బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్
అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి
కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్
సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ
చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు
తెలుస్తోంది.
మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య
వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా,
దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో ఈ నెలలోనే
విడుదలకు సిద్ధం అవుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి