4 జులై, 2012

నెట్‌లో అమ్మాయి అసభ్య చిత్రాలు: ఐఐటి విద్యార్థి అరెస్టు

వరంగల్: సైబర్ నేరం కింద ఓ ఐఐటి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌తో అసభ్యకరంగా తీసిన అమ్మాయిల చిత్రాలను ఇంటర్నెట్‌లో పెట్టాడనే ఆరోపణపై వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన ఐఐటి విద్యార్థిని సైబర్ క్రైం విభాగం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌లోని రెడ్డిబజార్‌కు చెందిన బి. సురేందర్ ఢిల్లీ ఐఐటిలో టెక్స్‌టైల్స్ కోర్టు చివరి సంవత్సరం చదువుతున్నాడు.

నిరుడు అనతు మహబూబాబాద్‌కు చెందిన ఓ విద్యార్ధిని ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం కాన్పూర్‌లో చదువుతోంది. వీరి ప్రేమ వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మహబూబాబాద్ పోలీసు స్టేషన్‌లో సురేందర్‌పై కేసు నమోదైంది. సురేందర్ ఆ అమ్మాయి ఫొటోలను తన వద్ద ఉంచుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ మరోసారి ఫిర్యాదు చేయడంతో కాన్పూర్ పోలీసు స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.

దాంతో కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసి సురేందర్‌ను వారం రోజుల పాటు జైలుకు పంపినట్లు సమాచారం. తర్వాత కూడా అతను ఆ యువతి అసభ్యకరమైన ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టినట్లు ఫిర్యాదు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు సోమవారం రాత్రి మహబూబాబాద్‌కు వచ్చారు. మంగళవారం తెల్లవారు జామును అతన్ని తీసుకుని వెళ్లారు.
సురేందర్‌కు చెందిన లాప్‌టాప్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను కూడా సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానిక పోలీసులు ఈ విషయంపై మాట్లాడడం లేదు.

కామెంట్‌లు లేవు: