టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున
తాజాగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ'. సౌత్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా
నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ శివారు
ప్రాంతంలోని గడ్డి పోచారం ఇండస్ట్రియల్ పార్క్ పరిసరాల్లో జరుపుకుంది.
తాజాగా అక్కడ ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ఇందులో నాగార్జున ఓ
ఎన్నారైగా కనిపించనున్నారు. త్వరలో ఈచిత్రం యు.ఎస్ లో 40 రోజుల భారీ
షెడ్యూల్ జరుపుకోనుంది. అనీల్ బండారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కామాక్షి
మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం.
చాలా
కాలం తర్వాత నయనతార ఈచిత్రంలో నటిస్తుండటం, నాగార్జున లుక్ కొత్తగా,
ఆదునికంగా ఉండటంతో చిత్రంపై మంచి అంచనాలున్నాయి. నాగార్జున, దశరధ్
కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా
వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్
అవుతోంది.
నాగార్జున, నయనతార
జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్,
ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె.
సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే:
ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి.
విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి