13 జులై, 2012

ప్రభుదేవా దర్శకత్వంలో శృతిహాసన్ ఖరారు




















రౌడీరాథోడ్‌'తో హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'చిత్రం హిందీలోకి రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసారు. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ...మేము ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని అనుకున్నాము. అయితే శృతి హాసన్ బెస్ట్ ఛాయిస్ అనిపించింది అని చెప్పారు. ప్రస్తుతం ప్రభుదేవా ముంబైకి మకాం మార్చారు. బోనీకపూర్ ఖాళీ చేసిన వారి ఇంట్లో ఉంటున్నాడు.

ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్న విక్రమార్కుడు రీమేక్ గా 'రౌడీరాథోడ్‌'రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అతని దృష్టి తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'పై పడింది. త్రిష,సిద్దార్ద కాంబినేషన్ లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో హిందీలోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావించి చేయబోతున్నట్లు సమాచారం.

ఈసారి ప్రభుదేవా దృష్టి ప్రేమకథలపై పడింది. తొలిసారి ఆయన ఓ ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాని హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. హిందీ రీమేక్‌కి కుమార్‌ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్‌ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. సమంతని హీరోయిన్ గా ఎంచుకొనే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


ఇప్పటికే ఓ టీమ్ ..'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' స్క్ర్రిప్టులో ఛేంజ్ లు రాసి,నార్త్ కి తగినట్లు కామిడీని మార్చి తిరగరాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో రూపొందించిన ‘రౌడీ రాథోర్'ఘన విజయం సాధించింది. అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ఈ చిత్రం తెలుగులో రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావటంతో బాలీవుడ్ హీరోల దృష్టి మొత్తం ప్రభుదేవాపై పడింది. అందులోనూ సల్మాన్ ఖాన్ తో పోకిరి రీమేక్ ని వాంటెండ్ పేరుతో తీసి సూపర్ హిట్ చేయటం,ఇప్పుడు దక్షిణాది చిత్రాక కధల హవా నడవటం ఈ ప్రభుదేవాకు కలిసివచ్చింది.

కామెంట్‌లు లేవు: