పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా
పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో
రాంబాబు'. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో పాటు, తమిళ,
మళయాళ భాషల్లో ఒకే సారి విడుదల చేయాలని దర్సక,నిర్మాతలు ప్లాన్
చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు డబ్బింగ్, మిగతా పనులును వేగవంతం
చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా మూడు భాషల్లో విడుదల అవుతున్న పవన్
చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి ఇదో రికార్డు.
ఇక ఈ చిత్రం
పద్మాలయా స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారి సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఓ
స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఈ నెల 11 నుంచి 17 వ
తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం
ఇక్కడే షూట్ చేయనున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్
కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని
పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు సంగతి తెలిసిందే.
పవన్
కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి
స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్
మెకానిక్ గా కనిపించనున్నారు. మొన్నటివరకూ సారధిలో వేసిన మెకానిక్ షెడ్ లో
సీన్స్ పూర్తి చేసారు. 'గబ్బర్‌సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ
'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్
హిట్ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు.
ఈ చిత్రంలో
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు,
తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ
చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా,
ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో
డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ:
సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే,
దర్శకత్వం: పూరి జగన్నాథ్.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి