చెన్నై: ‘ఈగ' చిత్రం తమళ్ డబ్బింగ్ ‘నాన్ ఈ' హిట్టుతో తమిళనాట రాజమౌళికి
విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన చిత్రాల డబ్బింగ్ కు మంచి క్రేజ్
ఏర్పడింది. అందులో భాగంగా ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన
ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. అయితే పబ్లిసిటీలో మాత్రం
ఎక్కడా ప్రబాస్ ఫోటోలు వాడటం లేదు. కేవలం రాజమౌళి ఫోటనే వేసి.. ఆయన
పేరులోని మౌళి అనేది తీసుకుని పెట్టి క్రేజ్ తేవాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రభాస్,
శ్రియ జంటగా నటించిన ‘ఛత్రపతి' తమిళ్ తెరకు వెళ్లనుంది. రాజమౌళి పేరు
వచ్చేట్లుగా ‘చ్రందమౌళి' అని ఈ చిత్రానికి పేరు పెట్టడం విశేషం. అది
మాత్రమే కాదు.. సినిమాలో నటించిన నటీనటుల ఫొటోలతో కాకుండా పోస్టర్లలో
రాజమౌళి ఫొటోలనే వాడుతున్నారు. ఇటీవల రాజమౌళి ఫొటోతో పోస్టర్లు ముద్రించి
విడుదల చేశారు ఈ చిత్రాన్ని అనువదిస్తున్న నిర్మాత సతీష్.
తమిళంలో
విడుదల కానున్న సినిమా పోస్టర్‌పై తెలుగు దర్శకుడి బొమ్మని ఉపయోగించారంటే
రాజమౌళికి పరభాషలో ఎంత క్రేజ్ వచ్చిందో ఊహించవచ్చు. ప్రస్తుతం ‘చంద్రమౌళి'
అనువాద పనులు జరుగుతున్నాయి. సతీష్ ఫిలిం కార్పొరేషన్ ద్వారా ఈ చిత్రాన్ని
విడుదల చేయనున్నారు సతీష్. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు బాగా పడుతుందని
అంటున్నారు. పబ్లిసిటీ కూడా ‘నాన్ ఈ' దర్శకుడు మరో అద్భుత సృష్టి అన్నట్లు
చెప్తూ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం విజయవంతం అయితే మరిన్ని రాజమౌళి
చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ అవుతాయి అంటున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి
మిగతా చిత్రాల డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలను సంప్రదిస్తున్నట్లు
సమాచారం. ఈగ తెచ్చిన క్రేజ్ తమ చిత్రాల మార్కెటింగ్ కు ఉపయోగపడుతూండటంతో ఆ
నిర్మాతలు సైతం ఆనందంగా ఉన్నారు. ఇక రాజమౌళి ఈగ చిత్రం తమిళనాడు లో రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి