ఇక నాకు బాబా గురించి పెద్దగా తెలియదు. అయితే సినిమా ప్రారంభానికి రెండు
నెలల ముందు నుంచే మా ఇంటికి సాయిబాబా ఫొటోలు, విగ్రహాలు వచ్చాయి. అంతవరకు
నాకు శిరిడి సాయిబాబా పేరు వినడం, ఎవరైనా ప్రసాదం తెచ్చిస్తే తినడం తప్ప
అక్కడికి వెళ్లింది లేదు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు శిరిడి
వెళ్లాలనిపించింది. ఎవరికీ చెప్పకుండా వెళ్లాను అన్నారు నాగార్జున.
అలాగే
నేను షిర్డీ నుంచి తిరిగి రాగానే రాఘవేంద్రరావు ఈ కథ గురించి చెప్పారు.
వెంటనే సినిమా ప్రారంభమైంది. చిత్రీకరణ జరిగినన్ని రోజులూ సాయిబాబా ఏదో ఒక
రూపంలో కనిపించేవారు. అందుకే సమస్త సద్గురు సాయినాథ్ మహరాజ్‌కీ జై అని
తలచుకొంటుంటాన్నేను. అన్నమయ్య, శ్రీరామదాసులో భక్తుడిగా చేశాను కానీ...
సాయిబాబా పాత్రలో ఒదిగిపోవడం ఎలా? అని ఆలోచించడం మొదలుపెట్టగానే సెట్‌లో
'ఓం సాయి శ్రీసాయి' అని పాట వినిపించారు. అంతే ఆ పాత్రలో లీనమైపోయాను అని
చెప్పారు.
కీరవాణి మాట్లాడుతూ ‘‘‘అల్లరి మొగుడు' సమయంలో బాబా పాటతో
సంగీత చర్చలు మొదలుపెట్టాం. ఆ పాటను ఇంతవరకూ సినిమాల్లో ఉపయోగించలేకపోయాం.
చివరకు ఇందులో కుదిరింది. అంటే 20 ఏళ్లకు ముందే ఈ సినిమాకు అంకురార్పణ
జరిగిందని చెప్పాలి. బాబాగా నటిస్తున్న నాగార్జున ధన్యుడు. కామిగానివాడు
మోక్షగామిగాడు అనడానికి రాఘవేంద్రరావు గారే నిదర్శనం. ఈ నెల 30న పాటలు
విడుదల చేస్తాం'' అని చెప్పారు.
అన్నమయ్య, శ్రీరామదాసుల్లాగా ఈ
సినిమా చరిత్ర సృష్టిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. 60 రోజుల్లో చిత్రీకరణ
పూర్తయిందని, మిగిలిన ఒకే ఒక్క షాట్‌ను ఈ నెల 26న శిరిడీలో తీస్తారని
పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా పరుచూరి వెంకటేశ్వరరావు,
ఎస్. గోపాల్‌రెడ్డి, కె.విక్రమ్‌కుమార్ పాల్గొన్నారు.
2 కామెంట్‌లు:
అంత భక్తి ఉన్నప్పుడు మందుకొట్టి కెమేరాలకు దొరికిపోవడం ఎందుకు మాష్టారూ....
భక్తి వేరు. భక్తి అనేది ఒక సినిమా formula కావటం వేరు. ఈ భక్తి అనేది యెంత మంచి formula అంటే, కనీసం ప్రధానపాత్రధారి కూడా మంచి నటుడు కానవవుసరం లేదు. దీనికి శ్రీనాగార్జునగారే మంచి ఉదాహరణ. ఇక పోతే ఒక formula ను ఉపయోగించి సినిమా తీస్తున్నప్పుడు, దానికి సంబంధించిన మసాలా వార్తలు వండి వార్చి మీడియాలో వడ్డించి ప్రచారం చేసుకోవాలి గదా? చూస్తూ ఉండండి, షిర్దీ సాయిబాబాయే వచ్చి కూర్చుని తన సినిమా చూసాడనే వార్త లాంటిది కూడా మనం వినవచ్చును.
కామెంట్‌ను పోస్ట్ చేయండి