పవన్ కళ్యాణ్ తన అబిమానులును ఆనందపరిచేలా వైజాగ్ లో క్రికెట్ ఆడటానికి
సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జూలై 16న జరిగే T-20 క్రికెట్ మ్యాచ్ లో
పవన కళ్యాణ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఐదు గంటలు పాటు సాగే ఈ ఆట
ద్వారా వచ్చే ఎమౌంట్ ని అనాధలకు,గుడ్డి వారకి,వికలాంగులకు పంచనున్నారు.
చారిటీ నిమిత్తం కాబట్టే పవన్ వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. పవన్ ఈ
మ్యాచ్ లో పాల్గొంటే ఈ ఆటను స్పాన్సర్స్ చేసే టీవిలకు విపరీతమైన టీఆర్పీ లు
వస్తాయని భావిస్తున్నారు.
ఇక ఈ క్రికెట్ లో పవన్ తో పాటు
నాని,శర్వానంద్,నితిన్, అల్లరి నరేష్, తరుణ్,శ్రీకాంత్ వంటి వారు
పాల్గొంటారు. అలాగే హీరోయిన్స్ ఛార్మి, శ్రియా శరణ్,ప్రియమణి,రాధిక శరత్
కుమార్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై 'కెమెరామేన్ గంగతో
రాంబాబు' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో
జరుగుతోంది.
పవన్ ఈ చిత్రంలో మెకానిక్ గా కనిపించి అలరించనున్నారు.
హీరోయిన్ తమన్నా ..గంగగా మీడియాకు చెందిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఆమె
మెకానిక్ గా ఉండే పవన్ తో కలిసి సమాజానికి పనికివచ్చే రిపేర్స్
చేయిస్తుంది. మెకానిక్ గా ఉండే అతను కెమెరా తో సమాజంలోని కొన్ని దారుణాలను
ప్రజల ముందుకు తీసుకువచ్చి అవకతవకలను సరిచేస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ
పాత్ర పవన్ కెరీల్ లో ఓ కొత్త యాంగిల్ లో మాస్ కి పట్టేలా ఉంటుందని
సమాచారం.
ఇక మొన్నా మధ్య పవన్ పై ఓ ఐటం సాంగ్ ని సారధీ స్టూడియోస్
సెట్ లో తెరకెక్కించారు. శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని
భాస్కరభట్ల రవికుమార్ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్ హిందీలో
'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్ గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్ చిత్రం
'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
నేటి
రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు
సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి
నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని
విడుదల చేయనున్నట్లు ముందే పూరీ ప్రకటించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి