బెంగళూర్: సాద్విక్ శాస్త్రి అనే 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
కనిపించకుండా పోయాడు. బెంగళూర్‌లోని నేషనల్ పార్కు నుంచి అతను తప్పిపోయాడు.
శనివారం నుంచి అతని జాడ తెలియడం లేదు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు
చేపట్టారు. అయినా ఫలితం కనిపించలేదు.
ఆశిష్, అనుపమ్ అనే మిత్రులతో
కలిసి అనతు శనివారంనాడు బన్నెర్‌గట్టాలోని బయోలాజికల్ పార్కుకు వెళ్లాడు.
కొన్ని గంటల తర్వాత వెనక్కి వెళ్లిపోదామని వాహనాలు నిలిపిన చోటికి వచ్చారు.
తనకు చిన్నపాటి పని ఉందని, అది పూర్తి చేసి వస్తానని చెప్పాడని, తమను
వెళ్లిపోవాలని చెప్పాడని సాద్విక్ మిత్రుడు ఆశిష్ చెప్పాడు. ఐదు నిమిషాల
తర్వాత చూస్తే అతను తమను కలుసుకోకపోవడంతో ఆగిపోయామని అతను చెప్పాడు.
కొద్ది
సేపు వెతికామని, అయినా అతను కనిపించలేదని, తాము కాసవనహళ్లికి వెళ్లామని
అనుపమ్ చెప్పాడు. సాద్విక్ సురక్షితంగానే ఉంటాడని అటవీ అధికారులు ఆశాభావం
వ్యక్తం చేస్తున్నారు. పార్కు చుట్టూ గ్రామాలున్నాయని, ఓ రెండు గంటలు
నడిస్తే ఏదో ఒక ఊరు తగులుతుందని అధికారులు చెబుతున్నారు.
ఓ రోజు పాటు
అడవిలో ఉండడం సమస్యేమీ కాదని, అడవిలో లోనికి ఎందుకు వెళ్లడానికి గల
కారణమేమిటనేది తెలియడం లేదని అంటున్నారు. సాద్విక్ న్యూ సిగ్మా సాఫ్ట్‌వేర్
సొల్యూషన్స్‌లో పనిచేస్తూ జెపి నగర్‌లో ఉంటున్నాడు. సాద్విక్ తల్లి
ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తండ్రి బెంగళూర్‌లో
అకౌంటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ సంస్థను నడుపుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి