దేశ వ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లకు గిరాకీ నానాటికీ బాగా పెరిగిపోతోంది. దీంతో ముందస్తు రిజర్వేషన్ కాలపరిమితిని రైల్వేశాఖ పెంచింది. ఇకపై 120 రోజులకు ముందుగా రైల్వే టిక్కెట్లను ముందుస్తుగా రిజర్వు చేసుకోవచ్చని రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. దీనిపై భారత రైల్వే శాఖ వాణిజ్య విభాగం అధికారులు మాట్లాడుతూ ప్రయాణికుడికి వెసులుబాటు కల్పించే నిమిత్తం నాలుగు నెలలకు ముందుగా రైల్వే టిక్కెట్లను రిజర్వు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఇందుకు సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) చేస్తుందని వారు తెలిపారు. ఈ నాలుగు నెలల ముందస్తు రిజర్వేషన్ విధానం పండుగలు, వేసవి సెలవుల్లో ప్రయాణం చేయదలచిన ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెపుతున్నారు.
అయితే, అతి తక్కువ దూరం ప్రయాణించే తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు మాత్రం ఈ సౌకర్యం వర్తించదన్నారు. ఈ రైళ్ళకు ప్రస్తుతం ఉన్న 15 రోజుల రిజర్వేషన్ కాలపరిమితిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. అలాగే, విదేశీ పర్యాటకుల రిజర్వేషన్ కాల పరిమితి 360 రోజుల్లో కూడా ఎలాంటి మార్పు లేదన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి