గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుండగులు మంగళవారం సాయంత్రం కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని నకిరికల్ మండలం కుంకలగుంట గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి చేసిన దుండగుల్లో ఒకతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు లేదా నలుగురు ఈ దాడికి పాల్పడినట్లు చేసినట్లు తెలుస్తోంది. తోపులాట కూడా జరిగింది. ఇరు వర్గాల మధ్య కాస్తా ఘర్షణ కూడా జరిగింది. ఓ వ్యక్తి గాయపడ్డాడు కూడా. చేజెర్ల సంఘటన నేపథ్యంలో కుంకలగుంటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో జగన్ కాస్తా దూరంగా వెళ్లిపోయారు.
మిర్చి, పత్రి రైతులను కదిపితే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన అంతకు ముందు చేజేర్లలో అన్నారు. చేజెర్లలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. చేజెర్లలో కూడా కాస్తా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాటు చేస్తున్న సమయంలో కాస్తా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి పూనుకున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో విలువలు లేని రాజకీయాలు నడుపుతూ ప్రజా సమస్యలను, రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. నిరుడు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి