7 ఫిబ్ర, 2012

అసంతృప్తి నిజమే, చిరంజీవి ఐతే తప్పేం లేదు: బొత్స


Bost Satyanarayan
హైదరాబాద్: విస్తరణపై కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో సరి చేస్తారని అన్నారు. అసంతృప్తుల ఆవేదనను పార్టీ అర్థం చేసుకుందని చెప్పారు. వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు. శాఖల మార్పుల పైన సిఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. శాఖల మార్పులపై ఎవరికీ అసంతృప్తి లేదన్నారు. మంత్రి డిఎల్ అసంతృప్తి తనకు తెలియదన్నారు. ఉప ఎన్నికల ఫలితాలకు పార్టీయే బాధ్యత వహిస్తుందని అన్నారు. అది సమష్యి బాధ్యత అవుతుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పారు.

మంత్రులపై ఎవరూ లేని పోని ఆరోపణలు చేయవద్దని ఆయన ఐఏఎస్ అధికారులకు సూచించారు. అంశాల వారీగా పేర్కొని అక్రమాలకు బాధ్యులెవరో చెప్పాలన్నారు. మంత్రులపై విమర్శలు చేస్తున్న అధికారులు ఏ మంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విధాన నిర్ణయాలకు కేబినెట్ తప్పకుండా బాధ్యత వహిస్తుందని చెప్పారు. అయితే తెరవెనుక జరిగే వాటితో కేబినెట్‌కు సంబంధం లేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధికంగా బలహీనవర్గాలు, దళితులకు చోటు కల్పించినట్లు చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణకు రావాల్సిన ప్రాతినిథ్యం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిరంజీవి సిఎల్పీ నేత ఉప నేత అయితే తప్పేమిలేదని అన్నారు.

కామెంట్‌లు లేవు: