9 ఫిబ్ర, 2012

డబ్బులివ్వని ఇలియానా - నిర్మాత కంప్లైంట్

గోవా బ్యూటీ ఇలియానా మరో సారి వివాదాలతో వార్తల్లోకి ఎక్కింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత మోహన్ నటరాజన్ ఇలియానాపై కోలీవుడ్ ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేశారు. ఇలియానా తను నిర్మించబోయే సినిమాలో నటించడానికి రూ. 40 లక్షలు అడ్వాన్స్ తీసుకుందని, తన సినిమాలో నటించక పోయినా అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గతంలో నిర్మాత మోహన్..విక్రమ్ హీరోగా రూపొందించబోయే సినిమా కోసం ఇలియానాను ఎంపిక చేశారు. రూ.40 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో అప్పట్లో కంప్లైట్ చేసిన సదరు నిర్మాత తర్వాత ఆమెను సినిమా నుంచి తప్పించాడు. అయితే తన ఇవ్వాల్సిన రూ. 40 లక్షల అడ్వాన్స్ తిరిగి ఇవ్వక పోవడంతో ఆమెపై తాజాగా మరోసారి ఫిర్యాదు చేశాడు. 

గతంలో ఇలియానా తెలుగులో జూఎన్టీఆర్ సరసన శక్తి సినిమాలో నటించింది. ఆ సమయంలో నిర్మాత అశ్వనీదత్ ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్లో పాల్గొనడానికి డేట్స్ కేటాయించక పోవడమే అందుకు కారణం. ప్రస్తుతం ఇలియానా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో బర్ఫీ, వన్స్ అపానె టైమ్ ముంబై2, కిలాడీ 786 చిత్రాల్లో నటిస్తోంది.

కామెంట్‌లు లేవు: