దివంగత మహానేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ సర్కార్లు వైఎస్ఆర్ రెక్కల కష్టంతో ఏర్పాటైనవగా పేర్కొన్నారు.
తన తండ్రి జీవించివున్నప్పుడు ఒక్క నేత కూడా నోరు మెదపలేదని, ఇపుడు ప్రతి ఒక్కడూ అదే పనిగా విమర్శలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా, చనిపోయిన వైఎస్ఆర్‌కు ఓ న్యాయం, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజల సమస్యలను కాంగ్రెస్, టీడీపీలు గాలికొదిలేశాయన్నారు. తన తండ్రి రెక్కల కష్టంతో ఈ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని, ఈ ప్రభుత్వాలతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారన్నారు. వైఎస్ ఎక్కడకూ పోలేదని ఆయన ప్రతి గుండెల్లోనూ జీవించి ఉన్నారన్నారు.
వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏమూల చూసినా దీక్షలు, ఆందోళనలే జరుగుతున్నాయన్నారు. రైతులు వ్యవసాయం కంటే ఉరి వేసుకోవడం మంచిదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి