4 మార్చి, 2012

మార్షల్‌ఆర్ట్స్‌లో అనుష్క శిక్షణ వివరాలు

                                                       
సినిమాల్లోకి రాకముందు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా చేసిన అనుష్క మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటుంది. అయితే మార్షిల్ ఆర్ట్స్ లో క్లాసులో చెప్పటం కోసం మాత్రం కాదు. ఆర్య సరసన చేస్తున్న 'ఇరండాం ఉలగం' (రెండో లోకం) అనే తమిళ సినిమా కోసం ఆమె ఈ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆనూష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. అందులో భాగంగా ఆమె ఒక పాత్రలో గిరిజన మహిళగా కనిపిస్తుంది. ఈ పాత్రకోసమే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవాల్సి వచ్చినట్లు తెలిసింది. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఒక రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతున్నది. గతంలో ప్రభాస్‌తో భిల్లా సినిమాలో నటించిన అనుష్క అప్పుడు కూడా పోరాటాల్లో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. మరోపక్క కొరటాల శివ రూపొందిస్తున్న ప్రభాస్‌ తాజా చిత్రం 'వారధి'లో కూడా ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌తో రొమాన్స్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాగార్జున తాజా చిత్రం 'ఢమరుకం'లోను 'అలెక్స్‌ పాండియన్‌'లో కార్తీ, 'తాండవం'లో విక్రంతోనూ నటిస్తోంది.

కామెంట్‌లు లేవు: