20 మార్చి, 2012

స్టార్ హీరో సినిమాపై నిషేదం

Saif Ali Khan 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఏజెంట్’ వినోద్ చిత్రాన్ని పాకిస్థాన్‌‍లో నిషేదిస్తూ అక్కడి సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ గూడచార సంస్థ ఐఎస్ఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ఇండియన్ మూవీస్ పాకిస్థాన్‌లో బాగా ఆడతాయి. ముఖ్యంగా షారుఖ్, అమీర్, సల్మాన్, సైఫ్ అలీఖాన్ తదితర హీరోలకు అక్కడ చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే పాక్‌లో ఇండియన్ సినిమాలు నిషేదానికి గురి కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సినిమాలు అక్కడ నిషేదానికి గురయ్యాయి. తాజాగా ఆ లిస్టులో సైఫ్ అలీఖాన్ సినిమా కూడా చేరింది.

రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో సైఫ్ నిర్మించిన ఈచిత్రం ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంపై సైఫ్ చాలా ఆశలుపెట్టుకున్నాడు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు.

కామెంట్‌లు లేవు: