హైదరాబాద్: వైయస్ రాజశేఖరరెడ్డి, కేవీపీ రామచంద్రరావుతో కూడా పేకాట ఆడానని, కానీ కేసుల్లో ఇరుక్కొన్నానన్న ఆరోపణ పచ్చి అబద్ధమని తెలుగుదేశం శాసనసభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పేకాట ఆడి మూడుసార్లు అరెస్టయ్యారంటూ మంత్రి కన్నా ఆరోపణ ప్రస్తావనకు వచ్చింది.
"నేను రాజకీయాల్లోకి రాక ముందు గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రభుత్వ లెక్చరర్‌గా చేశాను. అక్కడ వేరే వ్యాపకం లేక కొందరు అధికారులతో కలిసి రిక్రియేషన్ క్లబ్బుగా ఏర్పడ్డాం. సరదాగా కాసేపు పేకాట ఆడుకొనేవాళ్ళం. అందులో డబ్బుల వంటి వ్యవహారాలేవీ ఉండేవి కావు. నా జీవితంలో ఎన్నడూ పేకాట ఆడి ఆరెస్టు కాలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్, కేవీపీతో కూడా పేకాట ఆడాను.'' అని అన్నారు. "కన్నా కారంపూడిలో ఒక మిల్లులో రోజుకు డెబ్భై రూపాయల కూలికి పని చేశారు. నూజివీడులో అత్తగారింటి వద్ద పశువులు కూడా కాశారు'' అని వివరించారు.
వెంటిలెటర్‌పై ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాపాడుతున్నారని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. పార్టీ విప్‌ను ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాలను ధరించి సభకు వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే డిస్‌క్వాలిఫై చేయాలనీ అంటున్నా ఇప్పటికీ వారిపై చర్య తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి