20 మార్చి, 2012

నా కొడుకుని సినిమాల్లోకి రానివ్వనంటూ సూపర్ స్టార్

Akshay Kumar 

నా కొడుకుని నేను సినిమాలకు దూరంగా ఉంచుదామనుకుంటున్నాను. వాడి చైల్డ్ హుడ్ ని ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాను. అయినా నా కొడుకుకి ఇప్పుడు కేవలం పదేళ్లే. పెద్దయ్యాక అంటారా.. సినిమాల్లోకి వెళతాను అని నిర్ణయం తీసుకుంటే ఆపేదేముంది అన్నారు. ప్రస్తుతానికి మాత్రం తన కొడుకుని తమ సినిమాల్లో నటింప చేయమని ఎవరూ అడగొద్దు అన్నారు. రీసెంట్ గా మీడియాతో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఆయన్ని చాలా మంది వాళ్ల అబ్బాయిని చైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ చేయమని అడుగుతూండటంతో ఇలా స్పందించారు. 

ఇక తాను చాలా డిసిప్లెనెడ్ లైఫ్ గడుపుతున్నానని అన్నారు. రాత్రిళ్లు ఎట్టి పరిస్దితుల్లోనూ తొమ్మిది.. తొమ్మిదిన్నరకల్లా పడుకుంటానని, తెల్లవారు ఝామున నాలుగున్నరకి లేస్తానని అన్నారు. తనకు పార్టీలంటే గిట్టదని, అక్కడ పెద్ద సౌండ్స్ తో పాటలు పెడుతూంటారని, అది చాలా విసుగెత్తించే అంశమని ఆయన వివరించారు. ప్రస్తుతం అక్షయ్ తన తాజా చిత్రం హౌస్ ఫుల్ 2 విడుదలకు సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఏప్రియల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే అక్షయ్... ప్రభుదేవా దర్శకత్వంలో విక్రమార్కుడు రీమేక్ చేస్తున్నారు. 

కామెంట్‌లు లేవు: