25 జూన్, 2012

అక్కడ 'ఈగ'3D వెర్షన్ విడుదల?




















వచ్చే నెల ఆరవ తేదీన విడుదల కానున్న 'ఈగ'విభిన్నమైన పబ్లిసిటీతో ఇప్పటికే ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేపింది. అలాగే ఈ చిత్రం గురించి రోజుకో వార్త వచ్చి ప్రేక్షకలను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగ ఈగ చిత్రం హిందీలో 3D వెర్షన్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర విలన్ గా చేసిన సుదీప్ కి అతనికి చెందిన వారు ఈగను 3Dలో చూస్తే ఆ ఎక్సపీరియన్స్ వేరని చెప్పటంతో రాజమౌళికి ఈ విషయం చెప్పారని వినికిడి. దాంతో సుదీప్ ఈగ హిందీ వెర్షన్ 3D లో వస్తుందని అన్నారు.

అయితే ఇప్పటికిప్పుడు ఓ సినిమాని 3D లోకి మార్చి రిలీజ్ చేయటం అంటే కష్టం. ఈగ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించేసారు. హిందీలోనూ ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. అయితే ఇప్పుడీ 3D నిర్ణయంతో అక్కడ రిలీజ్ చేయారా అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట. 'ఈగ' ఆలస్యానికి కారణం గ్రాఫిక్‌ వర్క్‌ పూర్తికాకపోవడమే నని తెలుస్తోంది. ఈ చిత్రంలో సింహ భాగం గ్రాఫిక్‌ తో నిండి ఉంటుంది. దాంతో ఈ గ్రాఫిక్ పనిని విభజించి పలువురికి అప్పజెప్పారు. వీరిలో కొందరు పూర్తిచేస్తే మరికొంత మంది సకాలంలో పూర్తిచేయక పోవడంతో వర్క్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉండటంతో సమస్య వచ్చింది. ఈ కారణంగా జూన్‌లో విడుదల చేయడం కూడా కష్టమని సమాచారం.

ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.

'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెబుతూ 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.

కామెంట్‌లు లేవు: