మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నారై మహిళ సునీతకు చెందిన భూమిని కొట్టేయడంలో
భాను కిరణ్ దందాకు ఓ టీవీ యాంకర్ సహకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ టీవీ
యాంకర్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సునీత అనే మహిళకు చెందిన
మహబూబ్‌నగర్ జిల్లాలోని తలకొండపల్లి మండలం చల్లంపల్లి గ్రామంలోని 25.26
ఎకరాల భూమిని 2006 నవంబర్ 5వ తేదీన భాను కిరణ్ ముఠా దొంగ పత్రాలతో దంతలూరి
కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు మీద
రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
రిజిస్ట్రేషన్
సమయంలో భాను కిరణ్ ఓ మహిళను తీసుకొచ్చి ఆమెనే సునీతగా కార్యాలయ సిబ్బందికి
పరిచయం చేసి, ఆమెతోనే సంతకాలు తీసుకున్నాడని సిఐడి విచారణలో వెల్లడైనట్లు
చెబుతున్నారు. ఆ మహిళ ఓ టీవీ చానెల్‌కు చెందిన మాజీ యాంకర్ అని సిబిఐ
విచారణలో భాను కిరణ్ బయటపెట్టినట్లు చెబుతున్నారు. సూరి హత్య సమయంలో ఆ టీవీ
యాంకర్ వ్యవహారం బయటకు వచ్చింది. తప్పుడు ధ్రువపత్రాలు బయటపడడంతో ఆ టీవీ
యాంకర్‌పై సిఐడి కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
భాను
కిరణ్ చేత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడని తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై ప్రభాకర్ రెడ్డి మీద సిఐడి అధికారులు ఇప్పటికే కేసు నమోదు
చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డికి కూడా ఈ
వ్యవహారం చుట్టుకుంటోంది. రేవంత్ రెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించే
అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సునీత శ్రీనివాస రెడ్డి ద్వారా
పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు, ఈ సమయంలో ప్రభాకర్ రెడ్డి,
మంగలి కృష్ణ రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు
చెబుతున్నారు. ఇందుకు భాను కిరణ్ ముఠా రేవంత్ రెడ్డికి 50 లక్షల రూపాయలు
చెల్లించే విధంగా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మరింత
సమాచారం రాబట్టేందుకు సిఐడి అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించవచ్చునని
అంటున్నారు. అయితే, ఈ విషయంలో తనకు ఏ విధమైన ప్రమేయం లేదని రేవంత్ రెడ్డి
అంటున్నారు.
కోర్టు అనుమతితో సిఐడి అధికారులు భాను కిరణ్, మంగలి
కృష్ణను తమ కస్టడీలోకి తీసుకుని ఆదివారం విచారించారు. ఆ విచారణలో పై
విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భాను కిరణ్‌ను, మంగలి
కృష్ణము ఆదివారం ఒకేచోట కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి