19 జూన్, 2012

లాభానికి లాభం..సుఖానికి సుఖం!

















ప్రముఖ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల నిర్మాణ సంస్థ ‘ఐబాల్’కొద్ది రోజుల గ్యాప్ తరువాత కొత్త ప్రాజెక్టుతో తెరపైకి వచ్చింది. స్లైడ్ 3జీ-7303 పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. ఈ గ్యాడ్జెట్ డిజైనింగ్ విషయంలో పాత మోడళ్ల పద్ధతినే అనుసరించారు. నిక్షిప్తం చేసిన ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆఫరేటింగ్ సిస్టం కొంత మేర నిరుత్సాహం కలిగించినప్పటికి పనితీరు విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఏర్పాటు చేసిన 3జీ సపోర్ట ఫీచర్ కమ్యూనికేషన్ అవసరాలను వేగవంతంగా  తీరుస్తుంది. మార్కెట్ల ధర అంచనా రూ.16,000. ఇతర ఫీచర్ల విషయానికొస్తే………

-    7 అంగుళాల టచ్ స్ర్కీన్,
-    డ్యూయల్ కెమెరా వ్యవస్థ,
-    హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,
-    1 గిగాహెడ్జ్ ప్రాసెసర్,
-    డివైజ్ ఇంటర్నల్ మెమరీ 8జీబి,
-    మైక్రోఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమెరీ శాతాన్ని 32జీబి పొడిగించుకోవచ్చు,
-    టాబ్లెట్‌ను హైడెఫినిషన్ టీవీలకు జతచేసుకునేందుకు వీలుగా హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,
-    డ్యూయల్ స్టీరియో స్పీకర్ వ్యవస్థ,
-    వై-ఫై,
-    బ్లూటూత్,
-    4400ఎమ్ఏహెచ్ Li-Ion బ్యాటరీ,
-    స్కైప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ముందుగానే లోడ్ చేశారు.
డివైజ్ ఖచ్చితమైన బరువు 450 గ్రాములు. ఏర్పాటు చేసిన 3జీ కనెక్టువిటీ సౌలభ్యత ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత వేగిరితం చేస్తుంది. సుఖవంతమైన కంప్యూటింగ్‌ను కోరుకునే వారికి ఐబాల్  స్లైడ్ 3జీ-7303 ఉత్తమ ఎంపిక.
Your Ad Here

కామెంట్‌లు లేవు: