సినిమా అంటే కేవలం నటనే కాదు. తెర వెనక పలు సాంకేతికపరమైన హంగులు
ఉంటాయి. దర్శకత్వం, ఛాయాగ్రహణం, కూర్పు, విజువల్ ఎఫెక్ట్స్... ఇలా పలు
విభాగాలుంటాయి అన్నారు నాగార్జున. ఆయన తాజాగా తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ
(జె.ఎన్.ఎ.ఎఫ్.ఎ.యు)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఇలా స్పందించారు.
అలాగే... చిత్రసీమలో గత ఐదారేళ్లుగా
విప్లవాత్మకమైన మార్పులొస్తున్నాయి. అవకాశాలు విస్తృతమయ్యాయి. అందుకే...
సాంకేతికంగా సుశిక్షితులైన ప్రతిభావంతులు మరింత మంది ఈ రంగంలోకి రావాల్సిన
అవసరం ఉంది అన్నారు అక్కినేని నాగార్జున. ఆయన అన్నపూర్ణ ఇంటర్నేషనల్
స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఎ.ఐ.ఎస్.ఎఫ్.ఎం)కి నాగార్జున
ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ
ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జె.ఎన్.ఎ.ఎఫ్.ఎ.యు)తో
ఒప్పందం కుదుర్చుకొంది.
ఇక తమ అన్నపూర్ణ స్కూల్‌లో చదివిన విద్యార్థులకు జె.ఎన్.ఎ.ఎఫ్.ఎ.యు. గుర్తింపునిస్తూ డిగ్రీ, పీజీ పట్టాలు అందజేస్తుంది. ఈ ఒప్పందం నాలుగేళ్లపాటు కొనసాగుతుంది.వీటిలో సాంకేతికపరమైన శిక్షణ అందించడంతోపాటు అందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీలు అందజేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ ఒప్పందం కుదుర్చుకొన్నాం. సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాము అన్నారు.

ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై జె.ఎన్.ఎ.ఎఫ్.ఎ.యు
వైస్ ఛాన్స్‌లర్ ఆర్.ఎం.డొబ్రియాల్, నాగార్జున సంతకాలు చేశారు. ఈ
కార్యక్రమంలో జె.ఎన్.ఎఫ్.ఎ.యు రిజిస్ట్రార్ ఎస్.కె.రెహమాన్, మాజీ
వైస్ ఛాన్సలర్ బాలసుబ్రహ్మణ్యం, ఎ.ఐఎస్.ఎఫ్.ఎం. వైస్ ప్రెసిడెంట్
గీతికాటాండన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నాగార్జున నటించిన ఢమరుకం చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే దశరధ్ దర్సకత్వంలో ఆయన లవ్ స్టోరీ అనే చిత్రం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి