గత ఇరవై రోజులుగా కేవలం రాత్రి వేళల్లోనే షూటింగ్‌లో పాల్గొంటున్నాను.
సాయంత్రం 6 గంటలకు షూటింగ్ మొదలవుతోంది. రాత్రి మూడింటికి క్రిష్ పేకప్
చెబుతున్నారు అంటున్నారు హీరో దగ్గుపాటి రానా. క్రిష్ దర్శకత్వంలో రానా
నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ
విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఒక్కోసారి
తెల్లవారుజామున 6 గంటల వరకూ షూటింగ్ చేస్తూనే ఉండాల్సి వస్తోంది.
ఇంటికెళ్లగానే టిఫిన్ చేయడం, నిద్ర పోవడం, మళ్లీ సాయంత్రం 6 గంటలకు
షూటింగ్‌కి అటెండ్ అవ్వడం... గత ఇరవై రోజులుగా ఇదే నా దిన చర్య. 14న జరిగిన
చరణ్ పెళ్లికి రాత్రంతా షూటింగ్‌లో పాల్గొనే అటెండ్ అయ్యాను. ఏది ఏమైనా
విజయన్ మాస్టర్ వండర్ అనిపించే రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌ని
తెరకెక్కిస్తున్నారని అన్నారు.
ఈ చిత్రంలో రానా పాత్ర పేరు బీటెక్ బాబు. నయనతార జర్నలిస్ట్‌గా నటిస్తోంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. జాగర్లమూడి సాయిబాబా నిర్మాత. గత ఇరవై రోజులుగా ఫైట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. కథానుగుణంగా కేవలం నైట్ ఎఫెక్ట్‌లోనే ఈ పోరాట దృశ్యాలను తెరకెక్కించడం జరుగుతోందని అన్నారు.
క్రిష్ రానా పాత్ర గురించి మాట్లాడుతూ...అతని పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు. ఇక ఈ చిత్రం ఇల్లీగల్ మైనింగ్ గనలు చుట్టూ తిరుగుతోందని సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి