తాగిన మత్తులో యవ్వనంలో ఉన్న కూతురిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన
భర్తను ఓ మహిళ చంపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే 43 ఏళ్ల వ్యక్తి మద్యం
సేవించి గత రాత్రి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఆ
తర్వాత కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు.
దాంతో భర్తపై భార్య
దాడి చేసి అతన్ని చంపేసింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి సంఘటన
గురించి చెప్పింది. వారికి 19 ఏళ్ల కుమారుడు, 9 నుంచి 13 ఏళ్ల వయస్సు గల
ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
ఇదిలా వుంటే, మహారాష్ట్రలోని చర్కోప్‌నకు
చెందిన ఓ మహిళ వారం క్రితం తన ఆరు నెలల పాపతో సముద్రంలో దూకి ఆత్మహత్య
చేసుకుంది. భర్త వైవాహికేతర సంబంధం అంటగట్టడంతో కలత చెందిన 23 ఏళ్ల మహిళ ఈ
దారుణానికి ఒడిగట్టింది.
పోలీసులు ఆమె భర్తను, అత్తవారింటి సభ్యులను
అరెస్టు చేశారు. ఆ మహిళను రంజనగా గుర్తించారు. ఆమె తన పాప గాయత్రితో కలిసి ఈ
నెల 14వ తేదీన ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దాంతో భర్త కిషన్ మిస్సింగ్
కింద ఫిర్యాదు చేశాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి