హైదరాబాద్:రామ్ చరణ్ ఫ్యాన్స్ అతని తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల
అవుతుందా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 2012 సంవత్సరం
కేవలం రామ్ చరణ్ రచ్చ మాత్రమే విడుదలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్ధితి ఉందని
తెలుస్తోంది. చరణ్ నటిస్తున్న మూడు చిత్రాలు వచ్చే సంవత్సరం అంటే 2013 లో
విడుదల కానున్నాయి. ఈ చిత్రాల్లో మొదట వివి వినాయిక్ దర్శకత్వంలో
రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం. మిగతా రెండూ ఆ
తర్వాత రెండు నెలల గ్యాప్ లో విడుదల అవుతాయి.
ఒకేసారి మూడు
సినిమాల్లో చేయటం వల్ల ఈ సమస్య వచ్చిందంటున్నారు. హిందీ రీమేక్
జంజీర్,వినాయిక్ తో చెర్రి,వంశీ పైడిపల్లితో ఎవడు చిత్రాలు రామ్ చరణ్
చేస్తున్నాడు. జంజీర్ విషయానికి వస్తే..''ఈ సినిమా నాకో సవాల్. తప్పకుండా ఈ
సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం
సంతోషంగా ఉంది'' అని రామ్ చరణ్ చెప్పారు. ఆయన తాజాగా హిందీలో ఆనాటి
సూపర్ హిట్ 'జంజీర్'రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
'జంజీర్'రీమేక్ చేయటం ద్వారా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రామ్
చరణ్..పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్నానని చెప్తున్నారు.
రామ్‌చరణ్
సరసన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అపూర్వ లఖియా
దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతోంది. రామ్
చరణ్, ప్రకాష్‌రాజ్‌లపై పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. ఈ
చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. చిరుత చిత్రం కూడా
బ్యాంకాక్ లోనే షూటింగ్ జరగటంతో ఈ చిత్రం కూడా బ్యాంకాక్ సెంటిమెంట్
వర్కవుట్ అవుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక వినాయిక్
దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి చెర్రీ అనే పేరు పెడుతున్నట్లు
సమాచారం. ఇందులో బ్రహ్మానందం పాత్ర జిలేబి. ఈ పాత్ర చుట్టూ కామెడీతో రన్
అవుతుందని చెప్తున్నారు. రెండు పాత్రల్లో రామ్ చరణ్ ఈ చిత్రంలో
కనిపించనున్నారు. రౌడీ అల్లుడు తరహాలో కామెడీతో ఈ సినిమా
సాగుతుందంటున్నారు. అదుర్స్స,రవితేజ కృష్ణ కలిపితే ఈ చిత్రం అవుతుందని
ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
1 కామెంట్:
>జంజీర్ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది'' అని రామ్ చరణ్ చెప్పారు.
బిగ్‌బి అప్పటికి ఇంకా బిగ్‌బి కాడు. అతడికి యెవరూ God Fathers లేరు కూడా. అతడేమీ ప్రముఖనటుడి కుమారుడుగా automatic గా గొప్పనటుల జాబితాలో చేరిపోయిన star కాదు. ఈరోజున రామ్ చరణ్ ఎంత చెత్తగా చేసినా భళీభళీ అనే మంద వెంట ఉంటారు. ఆరోజున నిజంగా బాగా చేయక పోతే బిగ్‌బి అనేవాడు స్మాల్‌బి కూడా అయ్యే వాడు కాదు. అదీ తేడా. బిగ్‌బి తో రామ్ చరణ్ పోల్చుకోవటం కేవల హాస్యాస్పదం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి